Viral: మీ ఒళ్లు బంగారం కానూ..తిరుమలలో గోల్డ్ మెన్ సందడి..ఎన్ని కిలోలో తెలిస్తే షాకే

Update: 2025-01-02 02:42 GMT

Viral: తిరుమల తిరుపతి దేవస్థానంలో గత రెండు రోజులుగా గోల్డ్ మెయిన్స్ సందడి చేస్తున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ చెందిన బంగారు బాబు సందడి చేస్తే.. తాజాగా బుధవారం కర్ణాటకకు చెందిన మరో గోల్డ్ మెన్ తిరుమలలో కనిపించారు. ఆయన ఒంటినిండా..ఏకంగా ఐదు కేజీల బంగారం ఉంది. ఆయనను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు . ఇక మంగళవారం నాడు హైదరాబాద్ కు చెందిన భక్తుడు ఒంటిపై ఏకంగా ఐదు కేజీల వరకు బంగారం వేసుకుని తిరుమలకు వచ్చారు.

ఇటీవల కాలంలో తిరుమలలో గోల్డ్ మెయిన్స్ సందడి కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం తెలంగాణకు చెందిన గోల్డ్ మెన్ సందడి చేస్తే.. తాజాగా కర్ణాటక చెందిన మరో బంగారు బాబు కనిపించారు. కర్ణాటక చెందిన రవి అనే వ్యక్తి తిరుమలకు వచ్చారు. ఆయన శరీరంపై ఏకంగా ఐదు కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయి. పెద్ద చైన్లు, కంఠాభరణాలు ధరించారు. భారీ బంగారు ఆభరణాలు వేసుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారాయన. అలాగే తెలంగాణకు చెందిన కొండ విజయకుమార్ బుధవారం స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ ఇద్దరు గోల్డ్ మెయిన్స్ భారీ బంగారు ఆభరణాలు, హారాలతో రావడంతో వీరిని ఆలయం బయట భక్తులు చూసేందుకు పోటీపడ్డారు.

హైదరాబాద్ కు చెందిన కొండ విజయకుమార్ ను కూడా గోల్డ్ మెన్ అనే పిలుస్తుంటారు. ఆయన తెలంగాణ ఒలంపిక్ సంఘం సంయుక్త కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఆయనకు బంగారం అంటే చాలా ఇంట్రెస్ట్ అట. అందుకే ఒంటిపై ఐదు కేజీల బంగారు ఆభరణాలు ధరించి మంగళవారం తిరుమలకు వచ్చారు. ఆయన విఐపి బ్రేక్ దర్శన సమయం లో శ్రీవారిని దర్శించుకున్నారు. విజయకుమార్ ఒంటిపై ఉన్న బంగారాన్ని చూసి భక్తులు షాక్ అయ్యారు. ఆయన ఒంటిపై ఐదు కేజీల బంగారపు ఉంటుందని అంచనా వేయిస్తున్నారు. విజయకుమార్ కు బంగారం పై ఉన్న ఇష్టంతో ఆయన భారీ ఆభరణాలు చేయించుకుని వేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు తరచుగా వస్తుంటారట. 

Tags:    

Similar News