వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ 2019 ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహాలు రచయిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయా పార్టీలకు చెందిన బలమైన నేతల్ని తనవైపు తిప్పుకునేందుకు పాదయాత్రను ఎంచుకున్నాడు. స్వకారం..స్వామికార్యం అన్న చందంగా ఓవైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు పార్టీని బలపరచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు , గూడురు, ప్రకాశం జిల్లాలలో చక్రం తిప్పిన మాజీ బాపట్ల ఎంపీ పనబాక లక్ష్మీ ఆమె భర్త పనబాక కృష్ణయ్యకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయతగా ఉన్న లక్ష్మీ, కృష్ణయ్యలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో 1996, 1998, 2004లో నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా 2009 బాపట్ల నుంచి ఎంపీగా పనబాకలక్ష్మీ పోటీ చేసి గెలుపొందారు. కేంద్రంలో జౌళి శాఖ సహాయ మంత్రిగా కూడా ఆమె పనిచేశారు. ఇక, అదే ఎన్నికల్లో గూడురు నుంచి పనబాక కృష్ణయ్య అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అయితే రాష్ట్రవిభజనతో చావుదెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన భవిష్యత్తు కోసం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం.
అయితే 2017లో భవిష్యత్తు కార్యచరణకోసం పనబాకలక్ష్మీ దంపతులు తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పనబాక లక్ష్మీ, పనబాక కృష్ణయ్యలు వైసీపీ లో చేరేతే భవిష్యత్తు బాగుంటుందని ఆమె అనుచరులు సలహా ఇచ్చారట. వారి కోరికమేరకు వైసీపీ లో చేరాలనుకున్న కార్యరూపం దాల్చలేదు . ఇప్పుడు జగన్ పాదయాత్రలో ఉండగానే పనబాక దంపతులు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారట.
అంతేకాదు వారిని ఆహ్వానించిన జగన్ బాపట్లలో వైసీపీకి ఇప్పుడు సరైన ఎంపీ అభ్యర్థి కరువు. దీంతో వచ్చే ఎన్నికల్లో పనబాక లక్ష్మిని ఇక్కడి నుంచి పోటీ చేయించడం ద్వారా ఆమె సొంత ఇమేజ్‌తోపాటు.. వైసీపీ ఇమేజ్ కూడా కలిసివచ్చి గెలుపు గుర్రం ఎక్కాలని ప్లాన్ చేస్తోంది. ఇక, గూడురు టికెట్ నుంచి గతంలో వైసీపీ తరఫున గెలుపొందిన పాశం సునీల్.. టీడీపీలోకి వెళ్లారు. దీంతో ఇక్కడ కూడా వైసీపీకి అభ్యర్థి కావాల్సిన అవసరం ఉంది. దీనిని కృష్ణయ్యకు కేటాయించి గెలిపించుకోవాలని వైసీపీ నిర్ణయించుకుంది. మరి పనబాక ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.