ప్రత్యేక హోదా కోసం రాజీనామాలుచేసి ఆమోదింపజేసుకున్న వైసీపీ ఎంపీలను వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అభినందించారు. వైసీపీ ఎంపీల ధైర్యానికి త్యాగానికి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఎంపీలంతా రాజీనామాలు చేసుంటే... కేంద్రం దిగొచ్చేదన్న జగన్... తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు బురద చల్లుతున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలకు 14నెలల ముందు రాజీనామాలు చేస్తే... ఎందుకు ఉపఎన్నికలు రావంటూ ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్న జగన్.... ఉపఎన్నికలు వస్తే తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా రావన్నారు జగన్మోహన్‌రెడ్డి.