ఆడపిల్లలు పుట్టారని భార్యా, బిడ్డలను వదిలేసి మరో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ ప్రబుద్ధుడు. అప్పటికే మొదటి భార్యను పిచ్చిదని, పిల్లలు పుట్టడం లేదని వదిలేసిన ఆ ప్రబుద్ధుడు రెండో పెళ్లి చేసుకుని ఇద్దరి ఆడపిల్లలకు తండ్రయ్యాడు. ఇప్పుడు వాళ్లనూ వదిలేసి మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. అతను పోలీస్ శాఖలో ఉద్యోగి. మొదటిసారి అతడికి పెళ్లయ్యింది భార్య పిచ్చిది పిల్లలు పుట్టడం లేదని విడాకులిచ్చాడు మరో పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఆమెను కూడా వదిలి దూరంగా వెళ్లిపోయాడు. ప్రస్తుతం మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో అతడి రెండో భార్య ప్రియాంక హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో తల్లి సుధతో కలిసి మీడియా ముందు తన గోడును వెళ్లబోసుకుంది.
హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన సాయికుమార్ ఇంటెలిజెన్స్ విభాగంలో డిప్యూటీ అనలైటికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. 2013లో అతడికి వివాహం జరగగా వివిధ కారణాలతో మొదటి భార్యకు విడాకులిచ్చాడు. కాగా 2015 ఫిబ్రవరి 15న అంబర్‌పేటకే చెందిన సుధ కూతురు ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు. కట్నం కింద 10 లక్షలకు పైగా తీసుకున్నాడు. వారికి ఇద్దరు కూతుళ్లు పుట్టారు. దీంతో కుటుంబంలో కలహాలు ప్రారంభమయ్యాయి. సాయికుమార్, అతడి తల్లి పద్మావతి, సోదరి స్వరూపలు అదనపు కట్నంకోసం వేధించడం ప్రారంభించారు. 18 నెలల క్రితం సాయికుమార్ భార్యాపిల్లలను వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సుధనే కూతురు, మనుమరాళ్లను పోషిస్తోంది. మూడోపెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన తన భర్త సాయికుమార్‌పై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది. మరి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.