నాటితరం హీరోల నుంచి నేటి తరం హీరోలతో పోటీ పడుతున్న హీరో తరుణ్ త్వరలో పెళ్లి పీఠలెక్కనున్నట్లు సమాచారం. గతంలో తరుణ్ పెళ్లి కావాల్సి ఉండగా కొన్ని అన్వేక కారణాలతో పెళ్లిఊసెత్తలేదు. అయితే అమ్మ కోరిక మేరకు తరుణ్ ఈ ఏడాది పెళ్లి చేసుకోకున్నాడు.
‘ఆదిత్య 369’, ‘అంజలి’, ‘మనసు మమత’ ‘శత్రువు’ వంటి సినిమాల్లో బాలనటుడిగా మెప్పించిన తరుణ్ 2000లో ‘నువ్వే కావాలి’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. నువ్వేకావాలితో లవర్ బాయ్ అనిపించుకున్న తరుణ్ వరుస ప్రేమకథలతో అభిమానుల్ని మెప్పించారు. ప్రస్తుతం ఈ లవర్ బాయ్ రమేష్ గోపి దర్శకత్వంలో ‘ఇది నా లవ్‌స్టోరీ’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేయనున్నారు.