తెలుగునాట మరో దిన పత్రిక అరంగేట్రం చేసింది. హైదరాబాద్ మారియట్ హోటల్‌లో విజయక్రాంతి తెలుగు దిన పత్రిక ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరై.... విజయ క్రాంతి తెలుగు దిన పత్రికను ప్రారంభించారు. పార్టీలకతీతంగా ప్రజల పక్షాన నిలవాలని విజయక్రాంతి యాజమాన్యానికి గడ్కరీ సూచించారు. ఏ పార్టీకి కొమ్ముకాయకుండా... నిష్పక్షపాతంగా వార్తలు ఇస్తామని విజయక్రాంతి తెలుగు దినపత్రిక ఛైర్మన్ సీఎల్ రాజం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల కోసం మరో పత్రిక అవసరమని భావించే విజయక్రాంతిని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు నేతలు పాల్గొని... విజయక్రాంతి తెలుగు దినపత్రికకు బెస్ట్ విషెస్ తెలియజేశారు.