ఇంద్రకీలాద్రిపై అధికారుల మధ్య వివాదం మరింత ముదురుతోంది. తాజాగా అసిస్టెంట్ ఈవో అచ్యుతరామయ్యపై ఈవో కోటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను బెదిరించేలా వ్యాఖ్యానించారంటూ పిటీషన్‌లో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఏఈవోపై కేసు నమోదు చేశారు. ఇటు మెమెంటోల కొనుగోళ్లు అక్రమాలపై విచారణ జరుగుతుందని దీనికి సంబంధించి నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశామని ఈవో తెలిపారు.