ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సెటైర్లు వేసిన రాముల‌మ్మ

Update: 2018-01-22 19:11 GMT

తెలంగాణ‌లో జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న పై అధికార ప్ర‌భుత్వం ఎలా ఉన్నా.. ప్రతిప‌క్ష‌నేత‌లు మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న‌పై మండిప‌డుతున్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ  పవన్ క‌ల్యాణ్ కు .. సీఎం కేసీఆర్ మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పొందాలు జ‌రిగాయ‌ని ఆరోపించారు. ఇక కొండ‌గ‌ట్టు సంద‌ర్శించిన ప‌వ‌న్ భ‌క్తితో చేస్తే ప‌ర్వాలేదు. రాజ‌కీయం మాత్రం చేయోద్ద‌ని సూచించారు. అంతేకాదు తెలంగాణ ఉద్య‌మ‌సమ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాణ‌లు చెప్పాల‌ని లేదంటే తెలంగాణ‌లో తిర‌గ‌నివ్వం అని హెచ్చ‌రించారు. 
 ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌రో సీనియ‌ర్ నేత విజ‌య్ శాంతి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న‌పై సెటైర్లు వేశారు. ఇన్నిరోజులు పార్టీకార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉన్న రాముల‌మ్మ ఒక్క‌సారి వెలుగులోకి రావ‌డం చ‌ర్చాంశ‌నీయ‌మైంది. 2014ఎన్నిక‌ల్లో మెద‌క్ లో పోటీ చేసిన రాముల‌మ్మ ఆ త‌రువాత గాంధీభ‌వ‌న్ వైపు ఒక్క‌సారి క‌న్నెత్తి చూడ‌లేదు.ఉన్న‌ట్లుండి  ఏమైందో కొద్దిరోజుల త‌రువాత రాహుల్‌తో భేటీ అయ్యారు. అయితే ఆ భేటీపై రాముల‌మ్మ‌కు పెద్ద ఎత్తున ప‌ద‌వులు క‌ట్ట‌బెడ‌తార‌నేది ప్ర‌చారం జ‌రిగింది. రాములమ్మకి ఏఐసీసీ కార్యదర్శి, ఎన్నికల ప్రచార కమిటీలో స్థానం ఇస్తారనే వార్తలు వ‌చ్చాయి. 
మ‌ళ్లీ ఇప్ప‌డు పవన్‌కల్యాణ్ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌తో యాక్టీవ్ అయిన‌ట్లు తెలుస్తోంది. ప‌వ‌న్ , సీఎం కేసీఆర్‌పై విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్‌‌కల్యాణ్‌‌ను టూరిస్ట్ అన్న కేసీఆర్.. తెలంగాణలో యాత్ర కోసం ఏ  వీసా ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్య‌మ‌నేత కోదండరాంతో పాటు , ఇతర నేతలకు కూడా పవన్‌ మాదిరిగా వీసాలిస్తే కనీసం వారికి తెలంగాణలో ఉన్నామన్న భావన కలుగుతుందని సెటైర్లు వేశారు. పవన్‌కల్యాణ్ లాంటి టూరిస్ట్‌ నేతకు ఇచ్చిన స్వేచ్ఛ ఉద్యమ నేతలకు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. 

Similar News