విజయవాడ వైసీపీ అగ్రనేత వంగవీటి రాధా ఎపిసోడ్ పై నేతలకు వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాధాను విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని జగన్ డిసైడ్ అయినట్టు ప్రచార సారాంశం. వాస్తవానికి గతంలో అయన తూర్పు నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. కానీ అనూహ్యంగా గద్దె రామ్మోహన్ చేతిలో ఓటమి చెందారు. ఎన్నికల అనంతరం అయన తిరిగి విజయవాడ సెంట్రల్ సీటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గౌతమ్ రెడ్డి తరువాత రాధానే అక్కడ ఇంఛార్జిగా కొనసాగుతూ వచ్చారు. ఈ క్రమంలో హటాత్తుగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీలో చేరిపోయారు. పైగా జరిగిన పరిణామాలతో సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకే కన్ఫర్మ్ చేసింది అధిష్టానం. ఈ పరిణామ క్రమం వంగవీటి రాధాకు రుచించలేదు. ఒకానొక దశలో రాధా పార్టీ మారతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ వారం రోజుల కిందటే రాధాతో.. జగన్ మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి. అయనకు తూర్పు అసెంబ్లీ, మచిలీపట్టణం పార్లమెంటు సీటును ఆఫర్ చేస్తే అయన మాత్రం తూర్పు సీటు ఇవ్వాలని జగన్ దృష్టికి తీసుకు వచ్చారట. దాంతో జగన్ కూడా ఒకే చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో రాధా తూర్పు నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. ఇదిలావుంటే అక్కడ ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఇంఛార్జిగా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా పోటీ చెయ్యాలన్న ఉద్దేయంతోనే ఆయన టీడీపీనుంచి వైసీపీలో చేరారు.. తాజాగా రాధా నిర్ణయం ఆయనను ఇరకాటంలో పడేసినట్టైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.