సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గించడం అన్యాయమన్నారు. గతంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల గల్లంతైన ఓట్లని తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. బీసీ గణన చేసి ఏ,బి,సి,డి కేటగిరీల ప్రకారమే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఉత్తం కుమార్ రెడ్డి కోరారు.