రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌ల రిజర్వేషన్లు ఖరారు

Update: 2018-12-24 15:50 GMT

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వచ్చే ఏడాది జనవరిలో పంచాయతి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. తొలిసారిగా మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి సారి జరుగుతున్న ఎన్నికల్లో  రిజర్వేషన్ల లెక్కలు కూడా మారాయి. ఎస్టీలకు 14.64 శాతం, ఎస్టీలకు 16.57 శాతం, బీసీలకు 18.39 శాతం సీట్లను రిజర్వ్ చేశారు. మొత్తం 12 వేల 751 పంచాయతీలకు గాను  ఎస్సీలకు 2 వేల 113, ఎస్టీలకు 18 వందల 65, బీసీలకు 2 వేల 345 పంచాయతీలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  100 శాతం గిరిజనులున్న పంచాయతీలు ఎస్టీలకే కేటాయించారు. దీంతో ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలు భారీగా పెరిగాయి.  
 

Similar News