సబ్బవరంలో దారుణం..సొంత తమ్ముడి భార్యపై ఇద్దరు అన్నదమ్ములు దాడి

Update: 2018-01-17 06:26 GMT

విశాఖ జిల్లా సబ్బవరంలో జరిగిన ఆ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. సొంత తమ్ముడి భార్యనే ఇద్దరు అన్నదమ్ములు చావబాదారు. కాళ్లతో ఇష్టానుసారంగా తంతూ, చెతులతో పిడిగుద్దులు గుద్దుతూ పైశాచికంగా హింసించారు. సాటి మహిళ అయి కూడా అత్త.. బాధితురాలి పట్ల ఎలాంటి జాలి చూపలేదు సరికదా, తానూ ఓ చేయి వేస్తాను అన్నట్లు కర్రతో దాడి చేసింది.

దాడిలో గాయపడ్డ బాధితురాలి పేరు లక్ష్మీ. ఆమె భర్త ఆర్మీలో పనిచేసేవారు. అయితే కొద్దిరోజులుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. సంక్రాంతి పండగ సందర్భంగా లక్ష్మీని తీసుకెళ్లడానికి ఆమె కుటుంబ సభ్యులు వచ్చారు. లక్ష్మీ కూడా పండగకు సొంతూరు వెళ్లాలనుకుంది. అయితే ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు. లక్ష్మీపై ఇద్దరు బావలు ఆగ్రహంతో ఊగిపోయారు. లక్ష్మీపై ఆ ఇద్దరు వ్యక్తులు పాశవికంగా దాడి చేశారు. ఈ విషయాన్ని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇద్దరు వ్యక్తులతో పాటు వారి తల్లిని అరెస్ట్ చేసి, విచారణ చేపడుతున్నారు.
 

Similar News