దిన‌క‌ర‌న్ కీల‌క నిర్ణ‌యం

Update: 2018-03-11 09:13 GMT

అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కృత నేత టీటీవీ దినకరన్ కొత్త పార్టీ లాంఛ్‌ తేదీని ప్రకటించాడు. గ‌త కొంత కాలంగా దినకరన్‌ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నాడంటూ తమిళ రాజకీయాల్లో చ‌ర్చ‌లు చ‌ర్చ‌లుగా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే.. ఈ క్ర‌మంలోనే ఈ నెల 15వ తేదీన కొత్త పార్టీని ప్ర‌క‌టించ‌నున్నారు.  ప్రకటనతోపాటు పార్టీ గుర్తును కూడా ప్రకటించబోతున్నారు. మధురైలో బహిరంగ సభ ఏర్పాటు ద్వారా తన పార్టీ సిద్ధాంతాలను దినకరన్‌ వెల్లడించనున్నారు. 

కమల్ హాస‌న్, రజనీకాంత్ రాజకీయ అరంగ్రేటం.. దీంతో పాటు పలువురు ప్రముఖులు రాజకీయాల్లో క్రియా శీలకంగా వ్యవహరించేందుకు సిద్ధమైతున్నారు. ఈ నేపథ్యంలోనే దినకరన్ ఊపు పెంచుతున్న‌ట్లు తెలుస్తోంది.అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి పళని సామి.. పన్నీర్‌సెల్వంతో కలిసి అన్నాడీఎంకే పార్టీపై పట్టుసాధించింది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. 

శశికళ-దినకరన్‌ వర్గంపై వేటు వేసి, వారిని అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. అయినప్పటికీ ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో దినకరన్‌ స్వతంత్ర్యగా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఓవైపు పార్టీలో సభ్యత్వం.. మరోవైపు రెండాకుల గుర్తును కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే దినకరన్‌ కొత్త పార్టీ పెట్టాల‌ని పూనుకున్నారు.
 

Similar News