కరీంనగర్ నగరంలో మరో టీఆర్‌ఎస్ కార్పొరేటర్ రాజీనామా చేశారు. పార్టీతో పాటు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వేధిస్తున్నాండంటూ కరీంనగర్ 12వ డివిజన్ కార్పొరేటర్ శ్రీలత మండిపడ్డారు. ఎమ్మెల్యే అయి ఉండి కూడా తన డివిజన్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని శ్రీలత తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన వేధింపులు ఆపకపోతే ఆయన పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఇప్పటికీ ఇదే వివాదంలో మరో మహిళా కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ రాజీనామా చేశారు.