'2006లోనే కేసీఆర్‌కు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచన': వినోద్

Update: 2018-12-25 12:14 GMT


భారత దేశాన్ని కేవలం యూపీఏ, ఎన్డీయే పరిపాలన చేయాలని చూస్తున్నాయని, అందుకే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారని తెలంగాణ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. అయితే 2006లోనే కెసిఆర్‌కు ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన వచ్చిందని అన్నారు. అసలు ప్రాంతీయ పార్టీలు అన్నీ ఆనాడే బలంగా(ఐక్యంగా) ఉంటే గత2006లోనే రాష్ట్రానికి ప్రత్యేక తెలంగాణ వచ్చేదని ఎంపీ వినోద్ వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒడిఒడిగా అడుగులు వెస్తున్నారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ ము‌ఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ, డీఎంకే నేత, స్టాలిన్, నవీన్ పట్నయక్ తో ఇప్పటికే మంతనాలు జరిపిన విషయం తెలిసిందే కాగా రేపో మాపో భారత ప్రధాని మోడీతో కూడా కెసిఆర్ సమావేశం కానున్నారు. 

Similar News