తెలంగాణా సీఎం కేసీఆర్ కుమార్తె ఎంపీ కవితకి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కనుందా..? కవితని ముందుముందు కేంద్ర మంత్రిగా చూడవచ్చా అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు..త్వరలో కేంద్ర మంత్రి వర్గంలోకి కవితని తీసుకోవాలని మోడీ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది..టీఆర్ఎస్ కి ఇప్పటి వరకూ కేంద్రం నుంచీ ఒక్క పదవి కూడా లేదు దాంతో మోడీ టీఆర్ఎస్ ని ఎన్డీయే లోకి కలుపుకుని మంత్రి వర్గ విస్తరణ చేసి టీఆర్ఎస్ కి కూడా స్థానం వచ్చేలా చేయాలనేది మోడీ ఆలోచనగా తెలుస్తోంది.
అయితే గత కొన్ని రోజులు గా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ వ్యాఖ్యలు చేయడం మమత ని ప్రత్యేకంగా వెళ్లి కలవడం.ఇలా ఈ పరిణామాలు అన్నిటినీ గమనించిన మోడీ కేసీఆర్ తో వైరం కంటే కలిసి మెలిసి ఉండటం మంచిదని అనుకున్నారు.. అందుకే కేసీఆర్ కుమార్తెకి కేంద్రంలో మంత్రి పదవి దక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి… కేంద్రమంత్రివర్గాన్ని జూన్‌లో ప్రధాని ‘మోడీ’ విస్తరించనున్నారని..ఈ విస్తరణలో ‘కవిత’ను మంత్రిని చేస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తెలంగాణకు ఇప్పటి మంత్రివర్గంలో స్థానం లేకపోవడంతో..టిఆర్‌ఎస్‌ను ఎన్‌డిఎ కూటమిలోకి చేర్చుకుని…వారికి మంత్రి పదవులు ఇవ్వాలని ‘మోడీ’ భావిస్తున్నారట. ఇన్నాళ్లూ ఎడమొహం..పెడ మొహంగా ఉన్న ప్రధాన ‘మోడీ’ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావులు మారిన రాజకీయ పరిస్థితుల్లో..ఒకరికొకరు సహకరించుకోవాలనే భావనతో ఉన్నారు.
అయితే నిన్నా మొన్నటి వరకూ థర్డ్ ఫ్రంట్ అంటూ హాదావిడి చేసిన ఆలోచనలు మానుకుని…ఎన్‌డిఎలో చేరితే ఎలా ఉంటుందనే దానిపై కెసిఆర్ తీవ్రంగా ఆలోచిస్తున్నారట. ఇప్పటికే ఎన్‌డిఎలో మూడవ అతి పెద్ద పార్టీగా ఉన్న టిడిపి ఆ కూటమి నుంచి బయటకు రావడంతో..ఆ స్థానంలో తాను చేరాలని కెసిఆర్ అండ్ కో నిర్ణయించుకున్నారట..అయితే ఈ ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉండటంతోనే థర్డ్ ఫ్రంట్ నినాదాన్ని కావాలనే కేసీఆర్ పక్క దారి మళ్ళించాడని అంటున్నారు..ఏది ఏమైనా సరే జూన్ నెల తరువాత జరిగే కేంద్ర మంత్రుల విస్తరణలో ఎంపీ కవితకి తప్పకుండా మంత్రిగా అవకాశం దక్కుతుదని తెలుస్తోంది..