టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన బాబుమోహన్ బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో టికెట్ దక్కకపోవడంతో బాబుమోహన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.