హోం మంత్రిగా మహమూద్‌ అలీ

Update: 2018-12-14 01:14 GMT

కేసీఆర్ తో పాటు నిన్న ప్రమాణస్వీకారం చేసిన మహముద్ అలీకి హోంశాఖను కేటాయించారు సీఎం కేసీఆర్. గతంలో రెవిన్యూ శాఖను పర్వేవేక్షించిన మహముద్ అలీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా కోనసాగనున్నారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన మహమూద్‌ అలీ 1953 మార్చి 2న జన్మించారు. ఆయన తండ్రిపేరు పీర్‌ మహ్మద్‌ బాబూమియా, తల్లి సయీదున్నీసా బేగం. భార్యపేరు నస్రీన్‌ ఫాతిమా. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు (ఫిర్దోస్‌ ఫాతిమా, అఫ్రోజ్‌ ఫాతిమా), కుమారుడు మహ్మద్‌ ఆజం అలీ. బీకాం వరకు చదివిన ఆయన పాల వ్యాపారం చేశారు. కాగా మంత్రివర్గంలో కేసీఆర్ తో సహా మొత్తం 18 మందికి 
చోటు దక్కనుంది. కేసీఆర్, మహమూద్ అలీ ఇప్పటికే ప్రమాణస్వీకారం చేయగా.. మిగిలిన 16 మందితో వారం రోజుల్లో కేబినెట్ విస్తరణ జరిపే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈనెల 18 న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. 

Similar News