టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాములు నాయక్. నాపై సుపారీ ఇచ్చి చంపలనే కుట్ర జరుగుతోందని నాకేమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటూ రాములు నాయక్ ఆరోపించారు. తానకు ప్రాణాహాని ఉందని అందుకే కోర్టును ఆశ్రయించబోతున్నానని రాములు నాయక్ చెప్పారు. గత ఏడాది నుంచే తనను టార్గెట్ చేశారని ఏదో విధంగా కేసులో ఇరికించడం, ఆర్థికంగా చాలా ఇబ్బందికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనుల కష్టాల గురించి మాట్లాడుతున్నందుకే తనను ఈ విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నరని తెలిపారు. నేడు శాసన మండలి ఛైర్మన్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సామాజిక సేవకుడిగానే తనకు గవర్నర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిదని తెలిపారు, ఎస్టీని ఐనందుకే తానపై ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ గూటికి చేరినవారికో న్యాయం నాకో న్యాయమా అని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని రాములు తెలిపారు.