కత్తిమషేష్ - పవన్ కల్యాణ్ వివాదం ఇప్పట్లో ముగిసే దాఖలాలు లేవని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు పవన్ సినిమాలు , వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసిన కత్తి 16వ తేదీవరకు వెయిట్ చేయండి అంటూ ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో కత్తిహేష్ పవన్ కల్యాణ్ గురించి ఏం మాట్లాడతారు.వివాదానికి పుల్ స్టాప్ పెట్టేస్తారా..అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి..మెగస్టార్ చిరంజీవికి లేక రాశారు. పవన్ -మహేష్ వివాదం లో చిరంజీవి జోక్యం చేసుకోవాలని కోరారు. గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను జీవితా రాజశేఖర్ అభిమానులు దాడిచేస్తే మీరే ఆ వివాదాన్ని పరిష్కరించారు.
గతమూడు నెలల నుంచి జరుగుతున్న సంఘటనల్ని చూస్తుంటే బాధగా ఉంది. పవన్ - కత్తిహేష్ గొడవ కారణంగా మెగా ఫ్యామిలీ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.మీ కుటుంబం అంటే గిట్టని వారు ఈ వివాదాన్ని పెంచి పోషించి నవ్వుకుంటున్నారు. ఇందులో మూడో వర్గం పాత్ర, ప్రమేయం ఎక్కువైంది. కాబట్టి మీరే ఈ వివాదానికి స్వస్తి పలికేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.