Bank Account: అలా చేస్తే మీ బ్యాంకు ఖాతా రద్దు అవుతుంది తెలుసా?
Bank Account: ఒకరికి ఎన్ని బ్యాంకు ఖాతాలుండాలి? దీని వల్ల ఏమైనా ఇబ్బందా? లావాదేవీలు చేయని ఖాతాలపై బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి?
Bank Account: ఒకరికి ఎన్ని బ్యాంకు ఖాతాలుండాలి? దీని వల్ల ఏమైనా ఇబ్బందా? లావాదేవీలు చేయని ఖాతాలపై బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? ఖాతాదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.
కొందరికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలుంటాయి. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగాలు మారిన సమయాల్లో కొత్తగా బ్యాంకు ఖాతాలను తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఒకటి కంటే ఎక్కువగా బ్యాంకు ఖాతాలు ఉంటాయి. అయితే బ్యాంకు ఖాతాలను ఉపయోగించరు. రెండు లేదా మూడు బ్యాంకు ఖాతాలను రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తుంటారు. అయితే ఖాతాను ప్రారంభించి అసలు సరైన నగదు నిల్వ లేకపోతే ఆ ఖాతాలు ఏం చేస్తారు? ఈ ఖాతాలు ఓపెన్ చేసిన ఖాతాదారుడికి ఫైన్ విధిస్తారా? ఖాతాలు రద్దు చేస్తారా? ఆర్ బీ ఐ నిబంధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
ఏదో అవసరం కోసం ప్రారంభించిన బ్యాంకు ఖాతాను కొన్నేళ్ళ తర్వాత వాడడం మానేస్తాం. అందులో ఖాతా మెయింటైన్ కోసం అవసరమైన నగదు కూడా ఉండదు. రెండేళ్లకు మించి ఎలాంటి లావాదేవీలు లేని ఖాతాలను బ్యాంకులు రద్దు చేస్తాయి. ఏడాది పాటు ఎలాంటి లావాదేవీలు లేని ఖాతాలను యాక్టివేట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. లేకపోతే వాటిని కూడా బ్యాంకులు నిలిపివేస్తాయి.
సేవింగ్స్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలి. అలా లేని బ్యాంకు ఖాతాలు కూడా రద్దు అవుతాయి. మరో వైపు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలున్నా ఇబ్బంది లేదు. అయితే ఈ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి.