Gold Rate Today: మహిళలకు షాక్..రూ. 80వేలు దాటిన తులం బంగారం ధర..నేడు ఎంత పెరిగిందంటే?

Update: 2025-01-16 01:06 GMT

Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు స్థిరంగా ఉన్న బంగారం ధరలు గత రెండు రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. మళ్లీ ఆల్ టైం గరిష్టానికి చేరుకుంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ. 80వేలు దాటింది. తాజాగా నేడు జనవరి 16వ తేదీ గురువారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దేశంలో బంగారం ధరలు రోజురోజుకు భారీగా పెరుగుతూ పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎంత ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆపడం లేదు. కాగా నేడు జనవరి 16వ తేదీ గురువారం తులం బంగారం ధరపై 110 రూపాయల వరకు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,400 రూపాయలు ఉండగా..24క్యారెట్ల 10గ్రాముల ధర రూ. 80,007 రూపాయల దగ్గర కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరరూ. 73,400 రూపాయలు ఉంది. 24క్యారట్ల బంగారం ధరరూ. 80,007 రూపాయల దగ్గర కొనసాగుతోంది.

ఢిల్లీలో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,550 ఉండగా..24క్యారెట్ల ధర రూ. 80,220 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 73,400 ఉండగా 24క్యారెట్ల ధర రూ. 80, 007 దగ్గర కొనసాగుతోంది. ముంబై లో 10 గ్రాముల పసిడి ధర రూ. 73,400 ఉండగా...24క్యారెట్ల ధర రూ. 80, 007 రూపాయల దగ్గర కొనసాగుతోంది. 

Tags:    

Similar News