రూ. 20 ప్రీమియంతో రూ. 2 లక్షల ఇన్సూరెన్స్

ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. అందుకే ఇన్సూరెన్స్ చేయాలని చెబుతారు. ఇన్సూరెన్స్ ప్రీమియం బట్టి పాలసీ ఉంటుంది. బ్యాంకుల్లో ఖాతాలుంటే ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. అతి తక్కువ ప్రీమియంతోనే రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ అందుతుంది.

Update: 2025-01-13 14:02 GMT

ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. అందుకే ఇన్సూరెన్స్ చేయాలని చెబుతారు. ఇన్సూరెన్స్ ప్రీమియం బట్టి పాలసీ ఉంటుంది. బ్యాంకుల్లో ఖాతాలుంటే ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. అతి తక్కువ ప్రీమియంతోనే రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ అందుతుంది.

బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతా ఉన్న వారికి ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన PMSBY కింద 20 రూపాయాలు చెల్లిస్తే చాలు 2 లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఈ పాలసీ తీసుకున్న ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే నామినికి 2 లక్షలు చెల్లిస్తారు. ఏడాదికి 20 రూపాయాలు చెల్లిస్తే రెండు లక్షలు వస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. ప్రతి ఏడాది తమ బ్యాంకు ఖాతా నుంచి 20 రూపాయాలు కట్ చేయాలని బ్యాంకుకు ఓ లేఖ అందిస్తే సరిపోతోంది. ఒక్కసారి ఈ లేఖ ఇస్తే చాలు... కొన్ని బ్యాంకులు ప్రతి ఏటా ఆటో డెబిట్ కింద దీన్ని వసూలు చేస్తున్నాయి. ఒకవేళ అలా చేయని ఖాతాదారులు ప్రతి ఏడాది బ్యాంకుకు తమ సమ్మతిని తెలుపుతూ లేఖ అందించాలి.

ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పీఎంజేజేబీవై అనే పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకంలో చేరిన వ్యక్తి ప్రమాదవశాత్తు లేదా ఇతర కారణాలతో మరణించినా 2 లక్షలు ఇన్సూరెన్స్ కింద ఇస్తారు. అయితే ఈ స్కీమ్ కింద ప్రతి ఏటా 450 నుంచి 500 ప్రీమియం కింద చెల్లించాలి.ఈ రెండు స్కీమ్స్ తో పాటు అటల్ ఫించన్ యోజన పథకంపై కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్రం ఆయా బ్యాంకులను ఆదేశించింది.

సాధారణంగా భీమా పాలసీ తీసుకోవాలంటే వయస్సుతో పాటు తీసుకొనే పాలసీ ఆధారంగా ప్రీమియం ఉంటుంది. పాలసీ తీసుకొనే వ్యక్తి ఆరోగ్య వివరాలను పరిగణనలోకి తీసుకొంటాయి ఇన్సూరెన్స్ కంపెనీలు. కానీ, బ్యాంకుల ద్వారా అందుతున్న ఈ పాలసీలను ఖాతాదారులు వినియోగించుకోవాలి. తమ బ్యాంకు ఖాతా నుంచి ప్రతి ఏటా ప్రీమియం డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుకు అనుమతిస్తే సరిపోతోంది.

Tags:    

Similar News