SBI Savings Schemes: లక్షాదికారి కావాలా? మీ కోసమే ఈ పథకం..

Update: 2025-01-12 13:45 GMT

Har ghar lakhpati scheme: ప్రస్తుతం పొదువు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఆదాయంతో సంబంధం లేకుండా వచ్చిన దాంట్లో కొంతమేర సేవింగ్ చేస్తున్నారు. మారిన ఆర్థిక అవసరాలు, భవిష్యత్‌ అవసరాల నేపథ్యంలో పొదుపు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ ఇలాంటి వారి కోసం మంచి పథకాన్ని తీసుకొచ్చింది.

'హర్‌ ఘర్‌ లఖ్​పతి' రికరింగ్ డిపాజిట్ స్కీమ్ పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ సేవింగ్ స్కీమ్‌లో చేరడం వల్ల లక్ష రూపాయలు ఎలా సేవ్‌ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ పథకం ద్వారా ఖాతాదారులు సులభంగా, ప్రణాళికాబద్ధంగా డబ్బు ఆదా చేసుకోవచ్చు. పదేళ్లు దాటిన మైనర్లతో పాటు పెద్దలు ఈ పథకంలో డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చు.

ఇక ఈ పథకం వ్యవధిని ఏడాది నుంచి 10 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు. సాధారణ కస్టమర్లకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వరకు పొదుపుపై వడ్డీ రేటును అందిస్తున్నారు. ఉదాహరణకు ఒక సాధారణ ఖాతాదారుడు మూడేళ్ల కాలానికి నెల నెలా రూ.2,500 చెల్లించినట్లయితే వడ్డీ 6.75 శాతంతో మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ.1 లక్ష అందుతాయి. అలాగే ఐదేళ్ల కాలానికి సెలక్ట్‌ చేసుకుంటే నెలకు రూ. 1407 చెల్లిస్తే 6.50 శాతం వడ్డీతో చేతికి రూ.1 లక్ష వస్తాయి.

ఒకవేళ 60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్‌ అయితే 3 ఏళ్ల కాలానికి నెలకు రూ.2480 కడితే 7.25 శాతం వడ్డీతో మెచ్యూరిటీ తర్వాత రూ.1 లక్ష వస్తాయి. ఐదేళ్లకు అయితే నెలకు రూ.1389 చొప్పున కట్టాలి. వడ్డీరేటు 7శాతంగా నిర్ణయించారు. ఈ పథకంలో చేరాలంటే అకౌంట్‌ ఉన్న భారతీయ పౌరులై ఉండాలి. ఎస్​బీఐ బ్రాంచ్‌లో లేదా ఆన్‌‌లైన్‌లో అకౌంట్‌ను ఓపెన్‌ చేయొచ్చు. ఒకవేళ నెల వారీ మొత్తం చెల్లించకపోయినా, ముందుగానే డబ్బు విత్‌డ్రా చేసుకున్నా కొంతమేర ఫైన్‌ పడుతుంది.

Tags:    

Similar News