Gold Rate Today: రూ. 80వేల దిశగా బంగారం ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగానే కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. మీ నగరాల్లో నేడు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగానే కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,640గా కొనసాగుతుంది. క్రితం రోజు కూడా ఇదే ధర ఉంది. అయితే 100 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 796,400గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 7,964 పలుకుతుంది. మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 7,3000 గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర ఉంది.
ఇక 100 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 73,0000 గా కొనసాగుతోంది. ఒక గ్రామ బంగారం ధర ప్రస్తుతం 7,300గా ఉంది. ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో బంగారం ధరలు ఆదివారం స్థిరంగానే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 73,150 ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర 79,800 ఉంది. కోల్ కతా, ముంబై, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
హైదరాబాదులో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 73,000 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 79,640గా నమోదు అయింది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఫెడ్ వడ్డీరేట్లు కోతపై అనిశ్చితి వంటి అంశాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గుల కారణమవుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
దేశంలో కూడా వెండి ధరలు ఆదివారము స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర 93,500 గా కొనసాగుతుంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. హైదరాబాదులో కిలో వెండి ధర 1,10,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్ కతా, బెంగళూరులోనూ ఈ విధంగానే ఉన్నాయి.