Production Growth: అద్భుతం సృష్టించిన దేశ పారిశ్రామిక రంగం.. ఆర్నెళ్ల గరిష్టానికి ఉత్పత్తి..!
Production Growth: పారిశ్రామిక ఉత్పత్తిపై గణాంకాల మంత్రిత్వ శాఖ శుక్రవారం కొత్త డేటాను విడుదల చేసింది.
Production Growth: పారిశ్రామిక ఉత్పత్తిపై గణాంకాల మంత్రిత్వ శాఖ శుక్రవారం కొత్త డేటాను విడుదల చేసింది. ఇది పారిశ్రామిక ఉత్పత్తిని కొలిచే సూచిక అయిన ఐఐపీ పెరుగుదలను నమోదు చేసిందని చూపించింది. ఐఐపీ సూచిక నవంబర్‌లో 5.2 శాతం పెరిగింది. ఇది అక్టోబర్ 2024లో 3.5 శాతంగా ఉంది.
మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, నవంబర్ 2024లో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక 2.5 శాతం పెరుగుదలను చూసింది. డేటా ప్రకారం, నవంబర్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తిలో మొత్తం 5.8 శాతం పెరుగుదల నమోదైంది. ఇందులో విద్యుత్ ఉత్పత్తి రంగంలో అత్యధిక పెరుగుదల 4.4 శాతంగా ఉంది. అదే సమయంలో మైనింగ్ సంబంధిత పనులు 1.9 శాతం పెరిగాయి. కాగా, అక్టోబర్ నెలలో ఈ రంగాల వృద్ధి వరుసగా 4.1 శాతం, 2 శాతం, 0.9 శాతంగా ఉంది.
6 నెలల్లో అత్యధిక ఉత్పత్తి
ఏప్రిల్-నవంబర్ కాలంలో ఐఐపీ 4.1 శాతం పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో ఇది 6.5 శాతంగా ఉంది. నవంబర్ 2024లో తయారీ రంగం ఉత్పత్తి 5.8 శాతం పెరిగింది. ఇది గత 6 నెలల్లో అత్యధికం. గత సంవత్సరం గురించి మాట్లాడుకుంటే.. గత సంవత్సరం ఇదే నెలలో తయారీ సూచిక 1.3 శాతంగా ఉంది.
"రాబోయే నెలల్లో ఈ (ఐఐపి వృద్ధి)వృద్ధి నిలకడగా ఉండగలదా అని మనం చూడాలి. ఎందుకంటే ఇది సంవత్సరానికి జిడిపి వృద్ధిని పెంచడానికి సహాయపడుతుంది. తయారీ రంగం అగ్రస్థానంలో ఉంటుంది" అని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్త మదన్ సబ్నావిస్ చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. ఈ రంగం వృద్ధి రేటు 5.3శాతం వద్ద నెమ్మదిగా ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయి 6.4శాతానికి పడిపోతుందని అంచనా.