బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా?
మహిళలకు ఆర్ధిక స్వేచ్ఛ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం మహిళలకు ఉద్దేశించింది. ఇందులో సేవింగ్స్ చేయడానికి 2025 మార్చి 31 లాస్ట్ డేట్. 2023 లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.
మహిళలకు ఆర్ధిక స్వేచ్ఛ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2023 లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇందులో చేరడానికి 2025 మార్చి 31 లాస్ట్ డేట్.
బ్యాంకులో ఇచ్చే వడ్డీరేట్ల కంటే ఈ పథకంలో పెట్టుబడి పెడితే ఎక్కువ వడ్డీని చెల్లిస్తారు. ఈ పథకం కింద కనిష్టంగా వెయ్యి రూపాయాలు, గరిష్టంగా రెండు లక్షలు సేవింగ్స్ చేసుకోవచ్చు. ఏడాదికి 7.50 శాతం వడ్డీ చెల్లిస్తారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లెక్కిస్తారు. రెండేళ్లకు ఈ డబ్బును తీసుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో అసలు, వడ్డీ కలిపి తీసుకోవచ్చు. మైనర్ల పేరుతో ఖాతా ఓపెన్ చేయాలనుకుంటే గార్డియన్ ఆ ఖాతాను తెరవచ్చు.
ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఒక ఖాతాకు మరో ఖాతాకు మధ్య మూడు నెలల గ్యాప్ ఉండాలి. ఖాతాలోని డబ్బును ఏడాది తర్వాత 40 శాతం కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద పొదువు చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. దీని కింద పొందిన వడ్డీ నుంచి టీడీఎస్ మినహాయింపు ఉండదు.
జాతీయ బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల నుంచి కూడా ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ధరకాస్తు ఫారంతో పాటు ఆధార్ తో పాటు అవసరమైన సర్టిఫికెట్లతో ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఈ ఖాతాను ఓపెన్ చేసిన వారు మరణిస్తే అసలు వడ్డీని వెంటనే చెల్లిస్తారు. ఆరు నెలల తర్వాత ఈ ఖాతాను క్లోజ్ చేసినా 5.5 శాతం వడ్డీ చెల్లిస్తారు.బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో ఈ స్కీమ్ ధరఖాస్తు ఫారాలు లభిస్తాయి.