Coir Udyami Yojana: కేంద్రం నుంచి రూ. 4 లక్షల సబ్సిడీ పొందాలా?: ఇలా చేయండి

Coir Udyami Yojana: ఉపాధి కోసం చిన్న తరహా లేదా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల రూపంలో ఆర్ధిక సహాయం చేస్తోంది.

Update: 2025-01-15 14:10 GMT
Coir Udyami Yojana: కేంద్రం నుంచి రూ. 4 లక్షల సబ్సిడీ పొందాలా?: ఇలా చేయండి
  • whatsapp icon

ఉపాధి కోసం చిన్న తరహా లేదా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల రూపంలో ఆర్ధిక సహాయం చేస్తోంది. అయితే ఇందుకు సంబంధించి విడుదల చేసిన గైడ్ లైన్స్ ను పాటిస్తే కేంద్రం అందించే ఆర్ధిక సహాయం అందుతుంది. దీని ఆధారంగా ఉపాధి పొందవచ్చు. మరికొందరికి కూడా ఉపాధి కూడా చూపవచ్చు. కాయిర్ ఉద్యమి యోజనకింద కేంద్రం తెచ్చిన పథకంతో కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పథకం కింద రూ. 4 లక్షలను సబ్సిడీగా పొందవచ్చు.

కాయిర్ ఉద్యమి యోజన పథకం కింద 10 లక్షల లోపు పెట్టుబడితో కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పది లక్షల్లో కేంద్ర ప్రభుత్వం 4 లక్షలను సబ్సిడీగా ఇస్తుంది. మరో 5.5 లక్షలను బ్యాంకులు రుణంగా ఇస్తాయి. మిగిలిన 50 వేలు పరిశ్రమ ఏర్పాటు చేసుకునే లబ్దిదారులు చెల్లించాలి. కొబ్బరి పీచుతో డోర్ మ్యాట్స్, తలగడలు, క్రికెట్ మ్యాట్, తాళ్లు, పరుపులు తయారు చేస్తారు.

ఈ పథకానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. లేదా మీ సేవాలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. coir udyami yojana సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.తొలుత ఈ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఈ స్కీమ్ కింద ధరఖాస్తు చేయాలి. ధరఖాస్తు ఫారంలో ఇచ్చిన వివరాలు నమోదు చేసి అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.

ఈ పథకం కింద యూనిట్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, కాయిర్ బోర్డు నుంచి పొందిన ట్రైనింగ్ కు సంబంధించి సర్టిఫికెట్ల, ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్, పరిశ్రమ ఏర్పాటుపై సీఏ ఇచ్చే సర్టిఫికెట్, జిల్లా పరిశ్రమల కేంద్రం ఇచ్చ ఎస్టాబ్లిష్ మెంట్ సర్టిఫికెట్ తో పాటు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన సర్టిఫికెట్లను కూడా జతపర్చాలి. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద ధరఖాస్తు చేసుకోవచ్చు. కొబ్బరి పీచు, నార తాళ్లు, కొబ్బరి ఉత్పత్తుల తయారీకి ఈ పథకం వర్తిస్తుంది. సంస్థ ఏర్పాటు చేసుకొని దీనికి ధరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఒకరు కూడా ఈ పథకం కింద ధరఖాస్తు చేసుకోవచ్చు.

Tags:    

Similar News