SBI Stree Shakti Yojana scheme details: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు స్త్రీ శక్తి లోన్ స్కీమ్. మహిళలు తమ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించేందుకు ఈ పథకం రూ.24 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ పథకం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు తక్కువ వడ్డీకే లోన్స్ పొందవచ్చు. అదే ఒకవేళ లోన్ మొత్తం రూ.2 లక్షల లోపు ఉన్నట్లయితే అదనంగా 0.5 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. అలాగే రూ.10 లక్షల లోపు లోన్స్ పై ఎలాంటి పూచికత్తుని సమర్పించాల్సిన అవసరంలేదు. ఇక ఈ పథకం ద్వారా పొందే లోన్స్ పై ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవు.
అయితే ఈ లోన్ పొందడానికి కొన్ని రకాల అర్హతలుండాలి. వ్యాపారంలో కనీసం 51 శాతం వాటా మహిళల పేరు మీద ఉండాలి. అలాగే మహిళలు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి మాత్రమే ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఈలోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళలు తమకు సమీపంలో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో అప్లికేషన్ ఫారంను పూర్తి చేసి డాక్యుమెంట్స్‌ను జత చేయాలి. ఈ డాక్యుమెంట్స్ జాబితాలో ఆధార్ కార్డు, పాన్ కార్డు, ప్రారంభించాలనుకుంటున్న వ్యాపారానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్, ఇన్‌కమ్ ప్రూఫ్, పాస్ పోర్టు ఫొటో ఉంటాయి.
బ్యాంక్ మీ దరఖాస్తును పరిశీలిస్తుంది. ఒకవేళ మీరు ఈ పథకానికి అర్హులని బ్యాంకు వారు భావించినట్లైతే.. మీ లోన్‌ని ఆమోదించడంతో పాటు లోన్ మొత్తాన్ని మీ బ్యాంకు అకౌంట్‌కి బదిలీ చేస్తుంది. ఈ పథకం మహిళలకు స్వయం ఉపాధిని ప్రోత్సహించడంతో పాటు, ఆర్థిన స్వావలంబన సాధించేందుకు వీలైన అవకాశం కల్పిస్తుంది. వ్యాపార రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయాలని ఆశపడే మహిళల ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.