Credit Score: క్రెడిట్ స్కోర్ పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Credit Score: రుణాల కోసం మీ క్రెడిట్ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటాయి బ్యాంకులు.క్రెడిట్ స్కోర్ పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Update: 2025-01-14 07:51 GMT

Credit Score: క్రెడిట్ స్కోర్ పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Credit Score: రుణాల కోసం మీ క్రెడిట్ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటాయి బ్యాంకులు.క్రెడిట్ స్కోర్ పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్రెడిట్ స్కోరు పెరగడానికి చాలా కారణాలుంటాయి. అదే పనిగా రుణాలు తీసుకొని వాటిని సకాలంలో చెల్లించినా క్రెడిట్ స్కోరు అంతంతమాత్రంగానే ఉంటుంది.

క్రెడిట్ కార్డును ఉపయోగించే పద్దతి కూడా స్కోరు పెరిగేందుకు దోహదపడుతుంది. క్రెడిట్ కార్డును 30 శాతానికి మించకూడదు. ఈ పరిమితి కంటే ఎక్కువగా వాడినా కూడా ఇబ్బందే. ఇది పరోక్షంగా క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపుతుంది. పర్సనల్ లోన్స్ తీసుకునేందుకు క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తే అది నష్టమే. ఇది పరోక్షంగా క్రెడిట్ స్కోరును దెబ్బతీస్తుంది. అప్పులను సకాలంలో చెల్లిస్తే స్కోరు పెరుగుతుంది.

మీరు అప్పులు తీసుకోకపోయినా ఇతరులు తీసుకునే రుణాలకు హామీ సంతకం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ హామీతో అప్పు తీసుకున్న వారు సకాలంలో వాయిదాలు చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపుతుంది. అది మీ క్రెడిట్ స్కోరు పెరగకుండా చూస్తుంది. అవసరం ఉన్నా లేకున్నా అప్పుల కోసం దరఖాస్తులు చేయవద్దు. ఇలా చేసినా కూడా క్రెడిట్ స్కోర్ తగ్గిపోవచ్చు. పర్సనల్ లోన్సు ఇస్తామని బ్యాంకుల నుంచి కానీ, ఇతర సంస్థల నుంచి వచ్చే ఫోన్లకు స్పందించి వివరాలు చెబితే ఆ సంస్థలు మీ క్రెడిట్ స్కోరును తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా మీరు ఒక రకంగా అప్పు తీసుకునేందుకు అప్లయి చేసినట్టే. ఇది కూడా మీ క్రెడిట్ స్కోరును పెరగకుండా నిరోధిస్తుంది.

క్రెడిట్ స్కోర్ పెరగాలంటే కొత్త అప్పులను తీసుకోకుండా కొంత కాలం వాయిదా వేయాలి. ఏడాదికి ఓసారి మీ క్రెడిట్ స్కోరును చెక్ చేసుకోవాలి. కొంత కాలం క్రెడిట్ కార్డును వాడడం మానేయాలి. రుణాలు తగ్గించుకోవాలి. క్రెడిట్ స్కోరును చెక్ చేసుకోవడం వల్ల మన పేరుతో ఎవరైనా అప్పులు తీసుకున్నారా అనే విషయాలు కూడా తెలుస్తాయి. ఆదాయం ఎక్కువగా ఉంటే క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉంటుందనే వాస్తవం కాదు. మీరు తీసుకునే అప్పు ఆధారంగానే క్రెడిట్ స్కోరును నిర్ధారిస్తారు.

Tags:    

Similar News