Udyogini Scheme: మహిళలకు 3 లక్షల వడ్డీ లేని రుణం.. ఈ డాక్యుమెంట్స్ చాలు..!
Udyogini Scheme: మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని పథకాన్ని తీసుకు వచ్చింది.
Udyogini Scheme: మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ పథకం కింద మహిళలకు 3 లక్షల వరకు రుణాన్ని అందిస్తారు. బీసీలకు 50 శాతం సబ్సిడీ అందిస్తారు. గ్రామీణ మహిళలకు ఈ పథకం కింద ప్రాధాన్యత ఇస్తారు.మహిళకే ఈ పథకం వర్తిస్తోంది. దరఖాస్తుదారులు 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఈ పథకం కింద అర్హత పొందాలంటే ఏడాదికి వార్షిక ఆదాయం ఒకటిన్నర లక్షలు ఉండాలి. చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు నడిపే మహిళలు కూడా ఈ పథకం కింద రుణం పొందేందుకు అర్హులు. అయితే ఈ పథకం కింద అర్హులైన మహిళలకు 3 లక్షలకు వడ్డీ కూడా ఉండదు.
ఈ పథకం కింద బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఆన్ లైన్ లోని ఉద్యోగి వెబ్ సైట్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ధరకాస్తును పరిశీలించిన అధికారులు బ్యాంకుకు పంపుతారు. బ్యాంకులో రుణానికి సంబంధించి ప్రక్రియను చేస్తారు. అయితే ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆన్ లైన్ లో దరఖాస్తు ఫారంతో పాటే అందించాలి.
డిప్యూటీ డైరెక్టర్ సీడీపీఓ కార్యాలయం నుంచి దరఖాస్తు ఫారం తీసుకొని దానికి అన్ని డాక్యుమెంట్లు జతచేసి సంబంధిత బ్యాంకులో సమర్పించాలి. ఈ పత్రాలను పరిశీలించిన తర్వాత లోన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. చిన్న వ్యాపారాలు చేసే మహిళలకు వడ్డీ లేని రుణం కూడా అందిస్తారు. ఆధార్ కార్డు, పాస్ పోర్టు సైజ్ ఫోటోలు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఇంటి అడ్రస్ ధృవీకరణ, ఆదాయ సర్టిఫికెట్, రేషన్ కార్డు, కుల ధృవీకరణ సర్టిఫికెట్, బ్యాంకు పాస్ బుక్ తో పాటు తమ వ్యాపారానికి సంబంధించిన వివరాలను కూడా మహిళలు అందించాలి. ఉద్యోగిని పథకం కోసం అవసరమైన సమాచారం కోసం 9319620533కు ఫోన్ చేయవచ్చు.