Tiara Credit Card: మహిళల కోసమే ఈ క్రెడిట్ కార్డు.. ఈ ఆఫర్లు మీకు తెలుసా?
Bank of Baroda Tiara Credit Card: మహిళల కోసం కొత్త క్రెడిట్ కార్డును బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రవేశ పెట్టింది.
Bank of Baroda Tiara Credit Card: మహిళల కోసం కొత్త క్రెడిట్ కార్డును బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రవేశ పెట్టింది. ఈ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే రివార్డు పాయింట్లు వస్తాయి. రూపే నెట్ వర్క్ పై ఇది పనిచేస్తుంది. అసలు ఈ కార్డుతో మహిళలకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా తియారా పేరుతో ఈ కార్డును తీసుకొచ్చింది.
ఫ్లిప్ కార్ట్ , లాక్మే సలోన్ మింత్రా, నైకా వోచర్లు ఈ కార్డు హోల్డర్లకు అందుతాయి. అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, గానా ప్లస్ మెంబర్ షిప్ కూడా ఇస్తారు. 31 వేల రూపాయాల విలువైన ప్రయోజనాలు ఈ కార్డు ద్వారా అందుతాయి. ఈ కార్డు కోసం 2499తో పాటు జీ ఎస్టీ చెల్లించాలి. కార్డు పొందిన 60 రోజుల్లో 25 వేలు లావాదేవీలు జరిపితే జాయినింగ్ ఫీజును వాపస్ చేస్తారు.లేదా ఏడాదిలో 2.50 లక్షలు ఖర్చు చేస్తే ఈ రుసుమును కూడా రద్దు చేస్తారు.
ప్రతి బిల్లింగ్ సైకిల్ లో 500 రూపాయాల వరకు యూపీఐ చెల్లింపులకు మాత్రమే రివార్డు పాయింట్లు ఇస్తారు. బుక్ మై షోలో మూవీ టికెట్ బుకింగ్ పై మూడు నెలలకు 250 డిస్కౌంట్ ఇస్తారు. 10 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద భీమా లభిస్తుంది. మూడు నెలలు స్విగ్గీ వన్ మెంబర్ షిప్ కూడా అందిస్తారు.
ప్రతి వంద రూపాయాల లావాదేవీలపై మూడు రివార్డు పాయింట్లు దక్కుతాయి. ట్రావెల్, డైనింగ్, ఇంటర్నేషనల్ కొనుగోళ్లపై వంద రూపాయాలకు 15 రివార్డు పాయింట్లు లభిస్తాయి. హెల్త్ ప్యాకేజీ, విమాన ప్రయాణాలకు కూడా ఈ కార్డుతో ప్రయోజనాలున్నాయి.