Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ కెరీర్‌ క్లోజ్ చేసిన గౌతమ్ గంభీర్.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!

Sarfaraz Khan: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వివాదాలతో నిండిపోయింది. ఈ సమయంలో రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ మధ్య వివాదాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వచ్చాయి.

Update: 2025-01-16 06:13 GMT

Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ కెరీర్‌ క్లోజ్ చేసిన గౌతమ్ గంభీర్.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!

Sarfaraz Khan: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వివాదాలతో నిండిపోయింది. ఈ సమయంలో రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ మధ్య వివాదాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వచ్చాయి. కొన్ని మీడియా నివేదికల ప్రకారం BCCI సమీక్ష సమావేశంలో డ్రెస్సింగ్ రూమ్ ప్రైవేట్ చాట్‌ను మీడియాకు లీక్ చేసింది సర్ఫరాజ్ ఖాన్ అని గౌతమ్ గంభీర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పేరు బయటకు రాగానే సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఆస్ట్రేలియాతో జరిగిన మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఓటమి తర్వాత గౌతమ్ గంభీర్ అందరు ఆటగాళ్లను బెదిరించాడు. ఆటగాళ్ళు తన మాట వినాలి లేదా జట్టు నుండి దూరంగా కూర్చోవాలని గంభీర్ అన్నారనే ప్రచారం కూడా తెరమీదికి వచ్చింది. ఈ వార్త ఆస్ట్రేలియా మీడియాలో కూడా చర్చనీయాంశంగా నిలిచింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే గంభీర్ కారణంగా సర్ఫరాజ్ ఖాన్ కెరీర్ ముగిసిపోతుందని సోషల్ మీడియాలో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో సర్ఫరాజ్ కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.

గౌతమ్ గంభీర్.. సర్ఫరాజ్ ఖాన్ విషయాలను లీక్ చేశాడని ఆరోపించాడని ఒక అభిమాని రాశాడు. కానీ ఇప్పుడు తన సమీక్ష సమావేశం వివరాలు కూడా లీక్ అయ్యాయి.. కాబట్టి గంభీర్ ఇప్పుడు వేరొకరిపై కల్పిత ఆరోపణలు చేస్తారా? ఒకప్పుడు విరాట్ కోహ్లీ కరుణ్ నాయర్ కెరీర్‌ను ముగించాడని, ఇప్పుడు గౌతమ్ గంభీర్ సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి అలాంటిదే చేస్తున్నాడని మరొకరు రాశారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఓటమిపై విమర్శలు రాకుండా ఉండటానికి గౌతమ్ గంభీర్ సర్ఫరాజ్‌ను పావుగా మార్చారని మరొక అభిమాని కామెంట్ చేశాడు.

ఇప్పుడు గౌతమ్ గంభీర్ కోచ్‌గా ఉన్నంత కాలం సర్ఫరాజ్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలు దాదాపుగా లేవని, ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం కూడా లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సర్ఫరాజ్ ఇప్పటివరకు భారతదేశం తరపున 6 టెస్ట్ మ్యాచ్‌ల్లో 371 పరుగులు చేశాడు. ఈ సమయంలో తను ఓ సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు చేశాడు.




Tags:    

Similar News