Viral Video: ఆసీస్ సెన్సెషన్ ప్లేయర్ తో సెల్ఫీ కోసం ఆరాటం.. కట్ చేస్తే.. ఊహించని ప్రమాదం..!

Sam Konstas: కొన్ని రోజుల క్రితం వరకు సామ్ కాన్స్టాస్ అనే పేరు ఎవరికీ పెద్దగా పరిచయం లేదు.

Update: 2025-01-16 10:21 GMT

Viral Video: ఆసీస్ సెన్సెషన్ ప్లేయర్ తో సెల్ఫీ కోసం ఆరాటం.. కట్ చేస్తే.. ఊహించని ప్రమాదం..!

Sam Konstas: కొన్ని రోజుల క్రితం వరకు సామ్ కాన్స్టాస్ అనే పేరు ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. కానీ, ఇటీవల భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య ముగిసిన టెస్ట్ సిరీస్ తర్వాత తన బాగా పాపులర్ అయ్యారు.ప్రస్తుతం ప్రతి ఒక్కరూ అతని గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. అంత పాపులారిటీ వచ్చిన తర్వాత తనకు అభిమానులు ఉండకపోతారా కచ్చితంగా ఎంతో కొంత మంది ఫ్యాన్స్ గా మారిపోయే ఉంటారు. అలా సెలబ్రిటీ అయిన సామ్ కాన్స్టాస్ తో ఫోటో దిగాలనే కోరిక ప్రతి అభిమానికి ఉంటుంది. కానీ అభిమానులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి వారిలో కలిసి ఫోటోలు దిగడానికి తొందరపడకూడదు. అలా ఇస్తే ఇలాగే అవుతుంది. అందుకు ఈ సీసీటీవీ కెమెరాలో రికార్డైన వీడియోనే సాక్ష్యం.

కాన్స్టాస్ తో ఫోటో దిగే ప్రయత్నంలో ప్రమాదం

ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. అక్కడ సామ్ కాన్స్టాస్ ప్రభావం ఒక అభిమానిపై స్పష్టంగా కనిపించింది. అతను తన కారు నడుపుతుండగా తన కళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న సామ్ కాన్స్టస్ పై పడ్డాయి. అతను కాన్స్టాస్ ని చూడగానే తన కారుని పక్కన పార్క్ చేసాడు కానీ హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయాడు. అతను ఫోటో తీయడానికి కాన్స్టస్ వైపు వెళ్ళిన వెంటనే అతని కారు ముందుకు కదలడం ప్రారంభించింది. అయితే, అతను సరైన సమయంలో పరిస్థితిని నియంత్రించడంతో పెద్ద సంఘటన ఏమీ జరగలేదు. కానీ అప్పటికీ ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టింది. ఇంత జరిగినా కాన్స్టాస్‌తో ఫోటో దిగాలనే అతని కోరిక మాత్రం నెరవేరలేదు.


సామ్ కాన్స్టస్ భారత్ తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. అతను 5 టెస్ట్‌ల సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లు ఆడాడు, అందులో అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. అతను భారతదేశంతో జరిగిన చివరి రెండు టెస్టులు ఆడి, 1 అర్ధ సెంచరీతో 113 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 60 పరుగులు. 19 ఏళ్ల యువ సంచలనం కాన్స్టాస్ ప్రస్తుతం బిగ్ బాష్‌లో ఆడుతున్నాడు. అక్కడ అతను సిడ్నీ థండర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భారత్‌తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత.. అతను ప్రస్తుత బిగ్ బాష్ సీజన్‌లో సిడ్నీ థండర్ తరపున 2 మ్యాచ్‌లు ఆడి 57 పరుగులు చేశాడు. వీటిలో 53 పరుగులు కేవలం ఒక మ్యాచ్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు తదుపరి మ్యాచ్‌కు ముందు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అభిమానితో ఫోటో సంఘటన జరిగినప్పుడు అతను సిడ్నీ థండర్ అదే ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనబోతున్నాడు.

Tags:    

Similar News