Team India Coach: టీం ఇండియాకు కొత్త కోచ్.. గౌతమ్ గంభీర్ పై బీసీసీఐ నమ్మకం కోల్పోయిందా?

Team India Coach: ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Update: 2025-01-16 05:01 GMT

Team India Coach: టీం ఇండియాకు కొత్త కోచ్.. గౌతమ్ గంభీర్ పై బీసీసీఐ నమ్మకం కోల్పోయిందా?

Team India Coach: ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీనికి అతిపెద్ద కారణం బ్యాటింగ్ లో బ్యా్ట్స్ మెన్ విఫలం కావడమే. ముఖ్యంగా విరాట్ కోహ్లీ లాంటి అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ వరుసగా 8 సార్లు ఇదే విధంగా ఔట్ కావడం, రోహిత్ శర్మ అట్టర్ ఫ్లాప్ బ్యాటింగ్ తర్వాత బీసీసీఐ ఆందోళన పెరిగింది. కాబట్టి ఇప్పుడు బీసీసీఐ భారత జట్టను త్వరగా మెరుగుపెట్టాలని చూస్తోంది. నివేదిక ప్రకారం, దీని కోసం బీసీసీఐ కొత్త కోచింగ్ సిబ్బందిని నియమించడం లేదంటే.. ఉన్న వాళ్లను బాగా పని చేయించుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం అవసరం అయితే కొన్ని కొత్త ఆఫ్షన్ల కోసం వెతుకుతుంది. ఈ వార్త వెలువడిన తర్వాత.. గౌతమ్ గంభీర్ పై బోర్డు నమ్మకం కోల్పోయిందా అనే ప్రశ్నలు తలెత్తడం ప్రారంభించాయి.

గంభీర్ పై బీసీసీఐ నమ్మకం కోల్పోయిందా?

భారత జట్టు ప్రదర్శనకు సంబంధించి జనవరి 11న ముంబైలో బీసీసీఐ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా పాల్గొన్నారు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. చాలా చర్చల తర్వాత గంభీర్ బ్యాటింగ్‌ను మెరుగుపరచడానికి తన సహాయక సిబ్బందిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, దీని కోసం బ్యాటింగ్ కోచ్‌ను తీసుకురావచ్చని జట్టు యాజమాన్యం నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. దీని కోసం బోర్డు అన్వేషణ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. బ్యాటింగ్ కోచ్ పాత్ర కోసం దేశీయ క్రికెట్ అనుభవజ్ఞులను పరిశీలిస్తున్నారు. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. గౌతమ్ గంభీర్ స్వతహాగానే మంచి బ్యాట్స్‌మన్. కానీ ఆస్ట్రేలియా పర్యటన తర్వాత, అతను కూడా పరిశీలనలో ఉన్నాడు. అయితే, గంభీర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతని ప్లేస్ సేఫ్ గానే ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం తన సహాయక సిబ్బందిలో బ్యాటింగ్ కోచ్ లేడు. అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చేట్ అసిస్టెంట్ కోచ్‌ల పాత్రలో ఉన్నారు. కానీ వారి పాత్ర కూడా పూర్తిగా స్పష్టంగా లేదు. అందుకే బోర్డు ఈ చర్య తీసుకుంది.

గంభీర్ సహాయక సిబ్బందిపై వేలాడుతున్న కత్తి

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. సమీక్షా సమావేశంలో, ప్రస్తుత సహాయక సిబ్బంది గురించి చర్చ జరిగింది. అయితే, ఏమి చర్చించారో స్పష్టంగా లేదు. కానీ భారత జట్టు బ్యాటింగ్‌ను మెరుగుపరచడానికి నిపుణులతో వెళ్లాలని BCCI ఇప్పుడు ఆలోచిస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి. మరోవైపు, అసిస్టెంట్ కోచ్‌లు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చేట్ కోచ్‌లపై కత్తి వేలాడనుందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. వారి పదవీకాలం కూడా తగ్గించబడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం గంభీర్ సహాయక సిబ్బందిలో అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చేట్ అసిస్టెంట్ కోచ్‌లుగా, మోర్నే మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా, టి దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నారు.

Tags:    

Similar News