చాలా మందికి 60లో 20లా కనబడాలని కోరికగా ఉంటుంది. కానీ పెరిగే వయసు రిత్యా చర్మంపై ముడతలు వస్తుంటాయి. అయితే అలాంటి ముడతల్ని తగ్గించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. వాటిని ఫాలో అయితే తప్పని సరిగా శరీరంపై ఉన్న ముడతల పోయి. మొఖం కాంతివంతంగా తయారవుతుందని సూచిస్తున్నారు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. గుడ్లు
గుడ్డు తినిడం వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో. ఆ గుడ్డులో ఉన్న తెల్లని సొనని శరీరానికి అప్లైయి చేయడం వల్ల కలిగే లాభాలు అన్నే ఉన్నాయని చెబుతున్నారు. సొనలో ఉండే పోషకాల వల్ల శరీరంపై ముడతలు పోయి ముఖవర్చస్సు పెరుగుతంది.
2. గ్లిజరిన్
టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ లో తగిన మోతాదు మేర గ్లిజరిన్ ను యాడ్ చేయాలి. వాటిలో నిమ్మరసం కలిపి
టేబుల్ స్పూన్ మేర గులాబీ నీటిని తీసుకుని అందులో అంతే మోతాదులో గ్లిజరిన్‌ని కలుపుకోవాలి. ఈ రెండింటిలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కలిపి ముఖానికి రాసుకోవాలి. అలా చేస్తే తగిన ఫలితాన్ని ఇస్తుంది.
3. కొబ్బరినూనె
కొబ్బరి నూనె శరీరానికి పూసుకోవడం వల్ల ముడతలు పోయి..శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.