ఉపఎన్నికలకు సిద్ధంగా ఉన్నానంటూ టీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. 2019 ఎన్నికలకు ఉప ఎన్నికలు సెమీ ఫైనల్ లాంటివని అన్నారు. అంతేకాదు ఈ ఉప ఎన్నిక తన కు - కేసీఆర్ కు మధ్య జరిగే పోటీ గా అభివర్ణించారు.
అసెంబ్లీ సమావేశాల్లో కోమటి రెడ్డి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. రైతు ఆత్మహత్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటే చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని రైతుల ఆత్మహత్యలు - పలు ప్రభుత్వ పథకాలపై వివరణ ఇవ్వాలని టీ కాంగ్ నేతలు డిమాండ్ చేశారు. అయినా తన ప్రసంగాన్ని గవర్నర్ కొనసాగించడంతో మండిపడ్డ టీ కాంగ్ నేతలు సభ వెల్ లోకి దూసుకు వచ్చారు. ప్రభుత్వ పనితీరును విమర్శించారు.
నాడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఆందోళనను తాజాగా కాంగ్రెస్ సభలో కాపీ కొట్టడంతో సభ అట్టుడికింది. అసెంబ్లీలో మొదటి సారి సభ ప్రారంభానికి ముందే భారీగా మార్షల్స్ సభలో చేరి కాంగ్రెస్ సభ్యులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైకులు, హెడ్‌ఫోన్స్ విసరడం అది కాస్తా మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తగలడంతో గాయాలయ్యాయ్. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు మండలి ఛైర్మన్‌పై మైక్, హెడ్‌ఫోన్స్ విసరడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని, ఎమ్మెల్యే సంపత్ కుమార్ ల శాసన సభసభ్యత్వాన్ని రద్దు చేసింది.
అయితే తాను గవర్నర్ ప్రసంగం సందర్భంగా హెడ్‌ఫోన్ విసరలేదని వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ విషయమై వీడియో పుటేజీ కోసం స్పీకర్‌కు ఆర్టీఐ చట్టం కింద ధరఖాస్తు చేసినట్టు కూడ ఆయన చెప్పారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా తాను గవర్నర్ పైకి హెడ్ ఫోన్ విసరలేదని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను చింపివేసినట్టు చెప్పారు. తాను విసిరినట్టుగా చెబుతున్న హెడ్‌ఫోన్ గవర్నర్, స్పీకర్, శాసనమండలి ఛైర్మెన్‌కు తగిలినట్టుగా నిరూపిస్తే తానే రాజీనామాను చేయనున్నట్టు చెప్పారు.
శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై హైకోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. హరీష్ రావు నాకు మిత్రుడు. కానీ, తన మిత్రుడే తన శాసనసభసభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం తనకు భాదగా ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత హరీష్ రావు చాలా కష్టపడుతున్నాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.