ఉట్నూరు ఘటనపై ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు

Update: 2017-12-16 16:03 GMT

ఉట్నూరు ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. శాంతిభద్రతలను కంట్రోల్ చేయడంలో.. ఫెయిలయ్యారని భావించి ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌లు, ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా దివ్య, నిర్మల్‌ కలెక్టర్‌గా ప్రశాంతి, ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కరీంనగర్‌ డీఐజీ రవివర్మ, ఆదిలాబాద్‌ ఎస్పీ శ్రీనివాస్‌పై కూడా బదిలీ వేటు పడింది. డీఐజీ రవివర్మ, ఎస్పీ శ్రీనివాస్‌ డీజీపీకి రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వులిచ్చారు. కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీగా ప్రమోద్‌కుమార్‌, ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీగా విష్ణు వారియర్‌, కొమురం భీం జిల్లా ఎస్పీగా కల్మేశ్వర్ సింగెనవారె ను నియమిస్తూ.. ఆదేశాలు జారీ చేశారు. 
నాగర్‌‌కర్నూలు ఎస్పీగా సుంప్రీత్‌సింగ్‌‌ను నియమించారు.

Similar News