కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ ప్రతినిధిగా, ప్రజాప్రతినిధిగా 35ఏళ్ల నుంచి టీడీపీలో వున్నానని అలాంటిది తనకు సరైన ప్రాధాన్యత కల్పించకపోవడం వల్ల మనస్థాపం చెంది రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. కాగా రెండు రోజుల్లో అయన రాజకీయ నిర్ణయం ప్రకటించే అవకాశముంది. మరోవైపు జనసేన ప్రముఖులు ఆయనను ఆ పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.