ఏపీలో మోదీ ప్రేరేపిత రాజకీయాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. 2015లో రాజీ డ్రామాలు మొదలుపెట్టిన వైసీపీ ఎంపీలు ఇంకా కొనసాగిస్తున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల చెవుల్లో పువ్వుల నుంచి క్యాలీఫ్లవర్ల వరకు అన్ని పెట్టారంటూ శివ ప్రసాద్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు జాతీయ స్ధాయిలో చక్రం తిప్పుతారని మోడీ భయపడుతున్నారంటూ శివ ప్రసాద్ ఎద్దేవా చేశారు.