ఎన్నికలకు సిద్ధం కావాలంటూ తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమున్నందున పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయన్న ఉత్తమ్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ధీమా వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి ఇస్తామన్న టీపీసీసీ చీఫ్ 100రోజుల్లో రైతులకు రూ.2లక్షల చొప్పున రుణమాఫీ చేసి తీరుతామన్నారు.