ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజన ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. డిసెంబర్ 15 నాటికి అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనం పూర్తవుతుందని ఏపీ సర్కార్ వివరణ ఇచ్చింది. దీంతో జనవరి 1న ఏపీలో కొత్త హైకోర్టు ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, మౌలిక వసతులు పూర్తయ్యాక విభజన పూర్తి స్థాయిలో జరుగుతుందని వ్యాఖ్యానించింది. అప్పటి వరకు జడ్జిల నివాసాలు అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.