అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో అద్భుత దృశ్యం

Update: 2018-10-01 06:23 GMT

ప్రత్యక్ష నారాయణుడి కిరణాలు సూర్యనారాయణుడి పాదాలను తాకాయి. శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ద అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఇవాళ ఉదయం సూర్యుని లేలేత కిరణాలు స్వామివారి పాదాలను తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి సుందర రూపాన్ని కళ్లారా చూసేందుకు పోటీ పడ్డారు. 

ఏటా.. మార్చి, అక్టోబర్‌ నెలలో మూడు రోజుల పాటు.. ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. తొలిరోజున గర్భాలయంలోని స్వామివారి మూలవిరాట్టు పాదాలపై పాక్షికంగా కిరణాలు పడ్డాయి. ఉత్తరాయన, దక్షిణాయన కాలంలో వచ్చే మార్పుల్లో ఈ అద్భుతం సాక్షాత్కరింపబడుతుంది. కొద్ది క్షణాల పాటు కనిపించే ఈ సుందర దృశ్యాన్ని వీక్షించిన భక్తులు తరలించారు. 
 

Similar News