ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్ స్ట్రీట్‌లో ఏపీ జేఏసీ విద్యార్థులఆందోళన చేపట్టింది. వైఎస్‌ఆర్ సీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు నిరసనలో పాల్గొన్నారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు.