హైదరాబాద్ కూకట్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. పరీక్షలు బాగా రాయలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన 18ఏళ్ల ప్రియాంక షేక్‌పేటలోని నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీలో నిర్వహించిన పరీక్షలో ఫెయిలవ్వడం తనను బాధించిందని తన చదువుకు తల్లిదండ్రులు ఏటా 11లక్షలు ఖర్చు చేస్తున్నారని లేఖలో సూసైట్ నోట్ లో తెలిపింది. ప్రియాంక రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.