డైరక్టర్ రాజమౌళి నాస్తికుడు..!ఆయన పూజలు చేస్తున్నారంటే నమ్ముతారా. ఖచ్చితంగా నమ్మితీరాల్సిందే. ఎందుకంటే రాజమౌళి పూజలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్ని రాజమౌళి ఖండించే ప్రయత్నం చేయలేదు.
గతంలో తాను నాస్తికుడినని చెప్పిన విషయం తెలిసిందే. చిన్న వయసు నుంచి తనకు చర్చీలు, గుళ్లు, గోపురాలు, కాషాయ వస్త్రాలు ధరించడం చేసేవాడినని కానీ అవి నాకు ఏమాత్రం సంతృప్తి ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నాస్తికుడైన గుణ్ణం గంగరాజుతో పనిచేశానని..ఆయన అయన్ ర్యాండ్ బుక్ ఇచ్చాడని అప్పటి నుంచి తాను నాస్తికుడిగా ఉన్నట్లు రాజమౌళి బాహుబలి ప్రమోషనల్ లో తెలిపారు. ఇదిలా ఉంటే నాస్తికుడైన రాజమౌళి మంత్రాలయంలో గ్రహాల అనుకూలత కోసం పూజలు చేయిస్తున్నారట. బాహుబలి 2 సినిమా వరకు ఆయనకు శుక్ర దశ నడిచిందట. కానీ ఇప్పుడు శుక్ర మహార్దశ పూర్తవడంతో.. రాబోయే దశకి గ్రహాల అనుకూలత కోసం పూజలు చేయించాలని పండితులు చెప్పిన మాటని.. అక్షరాలా పాటిస్తున్నాడట రాజమౌళి. అందువల్లే రాజమౌళి మంత్రాలయంలో పూజలు జరిపిస్తున్నారని వార్తలు వచ్చాయి. వాటిపై రాజమౌళి స్పందించాల్సి ఉంది.