ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

Update: 2018-10-17 03:50 GMT

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలూరు మండలం పెద్దహోతురు సమీపంలో ... కర్నూలు నుంచి ఎలార్తి దర్గాకు వెళ్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 21 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది.
 

Similar News