నందమూరి హరికృష్ణ మృతిచెందారన్న వార్త తెలుసుకున్న మంత్రి అఖిలప్రియ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ అఖిలప్రియ వివాహం నేపథ్యంలో టీడీపీ ముఖ్యనేతలంతా ఆమె వివాహానికి హాజరుకావాల్సి వుంది. కానీ దురదృష్టవశాత్తు హరికృష్ణ మృతిచెందడంతో పెళ్లి వేడుకలో టీడీపీ అభిమానులంతా షాక్ లో మునిగిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు లోకేష్, కళా వెంకటరావు, దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యకార్యకర్తలు అందరూ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు.