ట్రైన్‌తో సెల్ఫీ దిగుతూ మరో యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట శివారులో చోటు చేసుకుంది. పట్టాలపై గూడ్స్ రైలు ఆగి ఉండడంతో ట్రైన్ ఎక్కి సాయి అనే యువకుడు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తూ హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో సాయికి తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటినా స్థానికులు ఆస్పత్రికి తరలించారు.