విజయనగరం జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు వైసీపీకి గుడ్ బై చెప్పి, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో పార్వతీపురంలో ఆయన టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా శత్రుచర్లకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు లోకేష్. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుతో పాటు పలువురు జిల్లా నేతలు పాల్గొన్నారు. శత్రుచర్ల చంద్రశేఖరరాజు వైసీపీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. చంద్రశేఖరరాజు ప్రస్తుత కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి స్వయానా మామయ్య. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చంద్రశేఖరరాజుకు పేరుంది. వైసీపీ స్థాపించిన తరువాత జిల్లాలో ప్రప్రథమంగా జగన్‌కి మద్దతు తెలిపిన వ్యక్తి చంద్రశేఖరరాజే కావడం విశేషం.